మూవీ రేటింగ్: 4/5 విశ్లేషణ ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211కు సంబంధించిన కథే ‘నాంది’ సినిమా. తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆయన కథ,కథనాలు సినిమాకు ఊపిరిపోశాయి. క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా భ్రస్టు పట్టిస్తున్నారనే అంశాలను ఎక్కడా లోపాలు లేకుండా చక్కగా తెరపై…